![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1002 లో.....రాజు మాస్క్ సర్దుకుంటూ వెళ్తుంటే అపర్ణకి చూడకుండా డాష్ ఇస్తాడు. రాజుని చూసిన అపర్ణ.. బాబు ఒకసారి మాస్క్ తియ్ ఎక్కడో చూసినట్లు ఉందని అంటుంది. అలా అపర్ణ అనగానే రాజు టెన్షన్ పడుతూ మీరు నన్నెక్కడ చూసారు.. ఎక్కడ చూడలేదంటూ వెళ్ళిపోతాడు కానీ అపర్ణ రాజుని చూసి అదే ఆలోచనలో ఉంటుంది. ఆ తర్వాత ఇందు, నందు అనుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. ఇందుని హగ్ చేసుకొని అక్క అని పిలుస్తుంది నందు.
ఏంటి మీరా అని ఇందు అడుగుతుంది. అదే మీ పుట్టినరోజు కదా విష్ చేద్దామని హగ్ చేసుకున్నానని నందు కవర్ చెప్తుంది. మీరేంటి ఇక్కడ అని ఇందు అడుగుతుంది. ఫ్లవర్ డెకరేషన్ కి వచ్చానని నందు చెప్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నా చెల్లి నందు గుర్తువస్తుంది.. తనకి నేనంటే చాలా ఇష్టం.. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఇందు చెప్తుంది. మీరంటే అంత ఇష్టం అన్నప్పుడు ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని నందు అడుగుతుంది. నా కష్టాన్ని చూడలేక అని ఇందు చెప్తుంది. సరే మీ చెల్లి వచ్చేవరకు నన్ను నీ చెల్లి అనుకోమని నందు అనగానే సరే నువ్వు కూడ నా చెల్లివే అని ఇందు అంటుంది. ఆ తర్వాత వర్క్ ఉందని నందు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కిచెన్ లో రాజు, లక్కీ మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇందు వచ్చి.. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారంటూ కోప్పడుతుంది. తనకి నీతో గొడవపడడం అంటే ఇష్టం అనుకుంటారా అందుకే మాస్క్ లో ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరీ గొడవ పెట్టుకుంటుందని లక్కీ అంటాడు.
ఆ తర్వాత స్వాతి తరుపున కిడ్నాపర్స్ కూల్ డ్రింక్స్ లో ఏదో పౌడర్ కలుపుతారు. అప్పుడే ఇందు వచ్చి ప్లాన్ ఎక్కడ వరకు వచ్చింది అంతా ఒకే కదా అని మాట్లాడుతుంది. కాసేపటికి ఇందు దగ్గరికి ఐశ్వర్య వచ్చి మాట్లాడుతుంది. ఈ రోజుతో మా రేఖ అనుకున్నది జరుగుతుందని ఇందుతో ఛాలెంజ్ చేస్తుంది. తరువాయి భాగంలో ఒకతను రేఖకి ఫోన్ చేసి మీరు బలవంతంగా ఆస్తులు లాక్కుంటున్నారని మీడియా వాళ్ళకి ఎవరో కాల్ చేసి చెప్పారని చెప్తాడు. దాంతో ఇందు దగ్గరికి రేఖ వెళ్లి.. ఇదంతా నువ్వే చేసావ్ కదా అని కోప్పడుతుంది. లేదు ఆంటీ. ఇప్పటికి నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఇందు అంటుంది. ఇక బలవంతంగా ఇందు చేత వేలిముద్ర పెట్టించాలని రేఖ ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |